కర్నూల్

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, జూన్ 7 : పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పట్టణంలోని ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ముస్లింలకు పుష్పగుచ్చం ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు అందజేశారు. పట్టణంలో మద్యం తాగుతూ కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ముస్లింలు ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఎస్పీ స్పందిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులకు గురిచేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎస్పీ హరినాథరెడ్డిని, సిబ్బందిని ఆదేశించారు. రంజాన్‌ను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఏ చిన్న సంఘటన జరిగినా తమ దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో రాహుల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు అల్త్ఫా, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.