హైదరాబాద్

జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు: కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 8: తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జెఎసి పనిచేస్తుందని జెఎసి చైర్మెన్ ప్రొఫెసర్. కోదండరామ్ పేర్కొన్నారు. బుధవారం ఓయులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ముఖ్యంగా అనేక విమర్శలు వచ్చినప్పుడు జెఎసికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. తాము ప్రజల పక్షాన ప్రజాసమస్యలపైనే మాట్లాడుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఫలితాలు అందరికీ దక్కాలని ప్రొ.జయశంకర్ పదేపదే చెప్పేవారని కోదండరామ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ లక్ష్యాలతో పనిచేయాలని సూచించేవారని ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. జయశంకర్ చూపిన మార్గంలోనే జెఎసి పయనిస్తుందని అన్నారు. జెఎసి గతంలో రకరకాల సమస్యలను ఎదుర్కొని తట్టుకుని నిలబడి పనిచేసిందన్నారు. తాము ప్రజల పక్షాన పౌరుడిగా మాట్లాడుతున్నామని దీనికి రాజకీయపార్టీలు కావాల్సిన అవసరం లేదని అన్నారు. తాము ప్రభుత్వం సమస్యలను తీసుకువెళ్లే ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. మూడు సంవత్సరాలుగా విసిల నియామకం లేదని, అధ్యాపకుల కొరత, హాస్టల్స్ సమస్యలు, మెస్‌బిల్లులు సరిపోక స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యలపై వచ్చేనెలలో విస్తృత స్థాయి సదస్సును నిర్వహించనున్నామని కోదండరామ్ తెలిపారు. వివిధ వర్సిటీల అధ్యాపక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో చర్చించనున్నామన్నారు. ఈ సదస్సు బాధ్యతలను ప్రొఫెసర్. పురుషోత్తంకు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించామని కోదండరామ్ తెలిపారు. అదే విధంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు నియామకాల కోసం విద్యార్థి లోకం అనేక త్యాగాలకు ఓర్చి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచామని అన్నారు. కాని తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు కాకుండా చీకట్లను పంచుతుందన్నారు. నిరుద్యోగ విద్యార్థులు నియామకాలు ఆలస్యం కావడంతో వయస్సు పెరిగిపోతుందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన ప్రొ.కోదండరామ్ ప్రజా సమస్యలపై పోరాటం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వచ్చేనెల మొదటివారంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.