హైదరాబాద్

భార్య గొంతు కోసి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 8: కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హత్యచేసి పారిపోయిన సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోజరిగింది. ధించిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి..మెట్టుగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మీ (21)కి కడప జిల్లాకు చెందిన వెంకటేశ్‌తో గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. వీరు లాలాపేట్ నఫీజ్‌గార్డెన్ వెనుకబాగంలో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ మద్యానికి బానిసగా మారి తరచూ భార్యతో గొడవపడుతుండేవారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడటంతో వెంకటేశ్ తన భార్య లక్ష్మీని గొంతుకోసి హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. కాగా బుధవారం ఉదయం ఇరుగుపొరుగుకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో లాలాగూడ పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచిచూడగా లక్ష్మి రక్తం మడుగులో పడి ఉండటంతో కేసును నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కాగా పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సకాలంలో ఆస్తిపన్ను చెల్లించిన
119 మందికి నగదు బహుమతులు

హైదరాబాద్, జూన్ 8: మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును సకాలంలో చెల్లించిన 119 మంది బకాయిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి అధికారులు నగదు బహుమతులను ప్రకటించారు. ఈ నెల 1వ తేదీనుంచి 7 తేదీ వరకు పన్ను చెల్లించిన వారిలో బంపర్ బహుమతికి అల్వాల్ సర్కిల్‌కు చెందిన బి. వెంకట్‌రెడ్డి విజేతగా ఎంపికయ్యారు. వెంకట్‌రెడ్డి వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రూ. 1800 పన్నుగా చెల్లించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సుమారు 25వేల 778 మంది రూ. 7 కోట్ల 78లక్షల 82వేల ఆస్తిపన్ను చెల్లించారు. వీరికి ముందుగా ప్రకటించిన విధంగా బహుమతులను ప్రకటించారు. వీరిలో బంపర్ బహుమతి వెంకట్‌రెడ్డికి దక్కగా, రూ. 25వేల మొదటి బహుమతిని ఎల్బీనగర్ సర్కిల్‌కు చెందిన సీతామహాలక్ష్మి గెలుపొందారు.
ఆమె వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ. 101 చెల్లించారు. రూ. 12500ల రెండు బహుమతుల్లో ఆబిడ్స్ సర్కిల్ 9బికి చెందిన సమీర్ ఫాతిమా, సికిందరాబాద్ సర్కిల్‌కు చెందిన అనంతరాములయ్యలు గెలుపొందారు.
రూ. 5వేల అయిదు బహుమతులకు గాను నరహరి, సరోజాపొద్దార్, జివిఎస్ వరప్రసాద్, మహేంద్రవాడ, వెంకటసూర్యకుమారి, శ్రీ రామ సత్యనారాయణలు గెలుచుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రూ. వెయ్యి చొప్పున వంద మందికి అందజేయనున్న కన్సోలేషన్ బహుమతులకు కూడా విజేతలను ఎంపిక చేశారు.