రంగారెడ్డి

మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 8: తెలంగాణ రైతాంగ ఆకాంక్షలను అనుగుణంగా రెండేళ్ల పాలనను పూర్తి చేశామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్ భగీరథతో ఏడాదిలోపు ఇంటింటికీ తాగునీరు అందుతుందని, మిషన్ కాకతీయతో చెరువుల జలకళ సంతరించుకుంటుందని చెప్పారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ సుజలాం సుఫలాం నినాదంతో తెలంగాణను సస్యశ్యామలం చేయడమే సంకల్పమని అన్నారు. మిషన్ కాకతీయకు రెండు విడతలుగా ఆరువేల కోట్ల కేటాయించామని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో తాగుసాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలతో రంగారెడ్డి జిల్లాలోని 12లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మరో రెండేళ్లలో యావత్ దేశమంతా తెలంగాణను చూసి నివ్వెర పోతుందని పేర్కొన్నారు. మూడో విడత రుణమాఫీతోపాటు రైతులకు ఖరీప్ రుణాలను ఇస్తామని తెలిపారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే నూతన వ్యవసాయ మార్కెట్‌లను ఏర్పాటు చేశామని అన్నారు. కాగ్నా నదిపై రూ.14కోట్లతో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం హరీశ్‌రావు చలువేనని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఐనెల్లి మాధవరెడ్డి, అనంతయ్య, మరో 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పట్టణంలోని అతిథి గృహం నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.
నాటికి..నేటికీ..
తెలంగాణ ద్రోహి చంద్రబాబు
తెలంగాణ పట్ల చంద్రబాబు పెనుభూతంగా మారారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తాండూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నాటికి నేటికి..తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు న్యాయబద్ధంగా అందే నీటి వాటాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

డయేరియా ప్రబలకుండా శ్రద్ధ పెట్టాలి
వికారాబాద్, జూన్ 8: వర్షాకాలం వచ్చినందున గ్రామాల్లో డయేరియా ప్రబలకుండా మంచినీటి సరఫరాపై శ్రద్ధ చూపాలని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి అరుణ సూచించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఉదయం గ్రామ కార్యదర్శులు, ఇవోఆర్‌డి, బిల్‌కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మధ్యాహ్నం సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు పన్నులు వసూలు చేస్తే నూటికి నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయవచ్చని, జూలైలోపు పెండింగ్ పన్నులు వసూలు చేయాలని చెప్పారు. గ్రామాల్లో మురికినీటి నిలువలు, వర్షపు నీటి నిలువలను గుర్తించి దోమలు పెరగకుండా వాటిపై కిరోసిన్, కాలిన నూనె చల్లాలని పేర్కొన్నారు. మంచినీటి పైపులైన్లు లీకేజి లేకుండా చూసుకోవాలని, నీరు కలుషితమైతే డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశముందని అన్నారు. మరమ్మతులపై ప్రతిపాదనలు ఇవ్వాలని, 14వ ఆర్థిక సంఘం నిధులు కేవలం మంచినీటి సరఫరాకే ఖర్చు చేయాలని గుర్తుచేశారు. నీటిలో కలిపే బ్లీచింగ్ పౌడర్‌కు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహణ ఉండాలని తెలిపారు. ఇళ్ళ వద్ద నల్ల గుంతలు ఉంటే మూసేయాలని, కొత్తగా నిర్మించే ఇళ్ళకు సైతం నల్లగుంతలు లేకుంటేనే అనుమతి ఇవ్వాలని వివరించారు. గుంతలు ఉంటే నీటిలో క్రిమి, కీటకాలు స్థావరంగా ఏర్పరచుకుని, పైపునుండి వెనక్కి వెళ్ళే నీటిలోకి అవి వెళితే అనారోగ్యాల పాలవుతారని స్పష్టం చేశారు. నీటి ట్యాంకులను శుభ్రపర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ట్యాంకు శుభ్రం చేసిన సమయంలో సమీప ఇంటి వారి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల జీవితాలతో ఆడుకోరాదని, మనిషి ప్రాణాన్ని పూడ్చలేమని పేర్కొన్నారు. సమావేశంలో వికారాబాద్ డివిజనల్ పంచాయతి అధికారి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.