హైదరాబాద్

వ్యాపార సంస్థలు చెత్తబుట్టలను పెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: నగరంలోని అన్ని రకాల వ్యాపార సంస్థలు సొంతగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి సూచించారు. బుధవారం ఉదయం ఆయన నగరంలోని అమీర్‌పేట, సత్యం ధియేటర్, యూసుఫ్‌గూడ, రెహ్మాత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ఆరు గంటలకు సత్యం ధియేటర్ వద్ద పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలిస్తుండగా స్థానిక దుకాణందార్లు చెత్తను రోడ్డుపై వేయటాన్ని గమనించారు. ప్రతి షాపు యజమానికి కూడా రోడ్డుపై చెత్త వేయకుండా షాపులోనే ప్రత్యేకంగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సత్యం ధియేటర్ ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలం ప్రహరీగోడ కూలిపోవటంతో అందులో స్థానికులు చెత్త వేస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ వెంటనే ప్రహరీగోడను పునరుద్దరించాలని యజమానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం అమీర్‌పేటలోని మైత్రివనం వద్ధ పనులను పరిశీలించిన ఆయన గతంతో పోల్చితే ఈ కూడలిలో బ్యానర్లు, పోస్టర్లు బాగా తగ్గాయని వ్యాఖ్యానించారు. యూసుఫ్‌గూడ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కమిషనర్ స్టేషన్ మెరుగైన నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. గత రెండురోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురదను తొలగించి, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలని కమిషనర్ సూచించారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి చెత్తను కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పటికపుడు తరలించాలన్నారు. యూసుఫ్‌గూడ, కృష్ణానగర్ మార్గంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద్య కార్మికుల వద్దనున్న పరిచయం పుస్తకాలను కమిషనర్ పరిశీలించారు. రెహ్మాత్‌నగర్‌లోని నీసియట్ క్యాంపస్‌లో పారిశుద్ధ్య పనులు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్కిల్ 10-ఏ లో వర్షాకాలం సందర్భంగా ఏర్పాటు చేసిన అత్యవసర బృందాలను పరిశీలించారు. విజేత ధియేటర్ వద్దనున్న బవార్చీ హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హలీం బట్టినక ఊడా కమిషనర్ తనిఖీ చేశారు. విజేత ధియేటర్ ఎదరుగా ఉన్న ఓపెన్ గ్యార్బెజి పాయింట్‌ను ఎత్తివేసేందుకు స్వచ్ఛ వాలంటీర్లుగా సేవలందించేందుకు బవార్చీ హోటల్ యజమానికి షౌకత్ ముందుకొచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ పాల్గొన్నారు.
వ్యవసాయ కుటుంబాలను
ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి
ఖైరతాబాద్, జూన్ 8: కరువు కోరల్లో చిక్కుకొని ఆత్మహత్యల బాటపడుతున్న వ్యవసాయ కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు జెఎసి డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి నాయకులు అంజిరెడ్డి, అచ్యుతరావు, వెంకటయ్య, రవి మాట్లాడుతూ తీవ్ర వర్షాబావ పరిస్థితుల నేపధ్యంలో తెలంగాణలోని రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యం వ్యవసాయానికి ఇవ్వకపోవడంతో ఆ రంగంపై ఆదారపడ్డ వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుందని అన్నారు. అక్రమ భూసేకరణకు అవకాశం ఇచ్చే విధంగా ఉన్న జి ఓ 123, అదేవిధంగా సహకార స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జిఓ 28 రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తామని ప్రకటించిన రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల ఇబ్బందులకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వచ్చిన రైతులకు రుణాలు అందడం లేదని, గతంలో కరువుతో బాధపడ్డ వారికి వర్షాలు పడ్డ పెట్టుబడి పెట్టి వ్యసాయం చేయలేని స్థితిలో ఉన్నారన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం ఆవేదన కలిగించే అంశమన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.