కృష్ణ

అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూన్ 8: రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు అధిగమిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక తాలుకా కార్యాలయం ఆవరణలో బుధవారం రాత్రి మహా సంకల్ప దీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు రాగానే రాజధాని నిర్మాణంపై సిఎం దృష్టి సారించారన్నారు. ఈమేరకు ప్రపంచ దేశాలు పర్యటించి అత్యద్భుతమైన రాజధాని నిర్మాణానికి సంకల్పం చేశారన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 46వేల 300 మంది రైతులకు రూ.136కోట్ల మేర రుణాలు మాఫీ చేశామని ఈసందర్భంగా ఆయన చెప్పారు. 5వేల 544 డ్వాక్రా సంఘాలకు రూ.67వేల 409 కోట్లు మాఫీ చేశామన్నారు. డ్వాక్రా మహిళలే సమాజాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యం సిద్ధించాలంటే మహిళలే ప్రభుత్వ పాత్ర పోషించాలన్నారు. మడ అడవుల అభివృద్ధికి రూ.335కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.340కోట్లు రాగల మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలో అందించనున్నట్లు తెలిపారు. గుల్లలమోదలో రాకెట్ లాంచర్, ఘంటసాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మహోన్నత విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపిపిలు, జెడ్పీటిసిలు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

‘కోత’ల్లేని ఆంధ్రప్రదేశ్
* మహాసంకల్ప దీక్షలో పాల్గొన్న పలువురు నాయకులు
* రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 8: విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా ప్రగతి సాధించామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం మహాసంకల్ప దీక్షను పురస్కరించుకుని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ ఈనెల 2 నుండి బుధవారం వరకు నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో రెండేళ్లలో సాధించిన ప్రగతి భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమాలు, చర్చా గోష్టులు ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి నేడు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన కాలంలో 22.05 మిలియన్లు విద్యుత్ లోటుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనతికాలంలోనే నిరంతర విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్ర చేసిన కాలంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, పింఛన్లను ఐదురెట్లు పెంచి సుమారు 55వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుందన్నారు. వైద్య ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని ప్రజలు సంపూర్ణ సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ఉచిత రోగ నిర్థారణకు సంబంధించిన 20 రకాల పరీక్షలను సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రుల్లో ఉచితంగా అందించబడతాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కోటీ 50 లక్షలు అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఐదువేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేసామన్నారు. నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాలకు వేలకోట్లు ఖర్చు చేసి జలసంరక్షణకు శ్రీకారం చుట్టామన్నారు. నగరంలో 3వేల కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 450 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. మచిలీపట్నం పోర్టును ఈ సంవత్సరం నాటికి పూర్తిచేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజి నుండి భవానీ ఘాట్ వరకు ఇబ్రహీంపట్నం ఫెర్రి వద్ద నుండి విశాలమైన ఘాట్లను పుష్కర యాత్రికులకు అనువుగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో 10 లక్షల గృహాలు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద ఇస్తున్నామన్నారు. సుమారు లక్షా 10వేలకు పైగా లబ్దిదారుల నుండి గృహాల కోసం అర్జీలు వచ్చాయని మంత్రి తెలిపారు. జగ్గయ్యపేట, ముక్త్యాల వద్ద 1600 కోట్ల రూపాయల ఖర్చుతో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తున్నామని, నగరంలో రూ.50కోట్లకు పైగా యుజిడి పనులు జరుగుతున్నాయని తద్వారా కాలువలో కలుస్తున్న మురుగునీటిని మళ్లిస్తామన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ రోజుకు 18 గంటలకు పైగా రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రైతులకు, డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేస్తున్నారని పేర్కొన్నారు. శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కరెంటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పింఛన్లు ఐదు రెట్లు పెంచామని, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ మాట్లాడుతూ 34వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి భూమి సేకరించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, బడ్జెట్‌లో 750 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమానికి కేటాయించటం జరిగిందన్నారు. శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న మాట్లాడుతూ నగరంలో 3వేల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధికి వెచ్చిస్తూ సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ పండుగల సమయంలో రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకల ద్వారా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కడప నుండి రాష్ట్ర ప్రజలతో చేయించిన మహా సంకల్ప ప్రతిజ్ఞను జిల్లా వేదికగా విజయవాడ నుండి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృజన, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.