మహబూబ్‌నగర్

విత్తనాల ప్యాకెట్లలో తేడాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 9: ఖరీఫ్ సీజన్ మొదలుకావడంతో ప్రైవేటు విత్తన విక్రయదారులు రైతన్నలను దగా చేసేందుకు నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో పత్తి, ఆముదం, మిరప నకిలి విత్తనాలతో పట్టుబడినప్పటికి అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
తాజాగా పట్టణంలోని వెంకటలక్ష్మిప్రసన్న విత్తన విక్రయ కేంద్రం వద్ద మిరప నకిలీ విత్తనాలు విక్రయం చేస్తున్నారని మల్దకల్ మండలం, మేకలసోంపల్లి రైతులు శాంతన్న, దాసు, జయన్న, ఆంజనేయులు, వెంకటన్న, రామాంజనేయులు, కర్రెన్నలతో పాటు మరికొంత మంది ఆరోపించారు. కళాస్ కంపెనీకి చెందిన మిరప విత్తనాల ప్యాకెట్లలో తూకాల తేడాలతో పాటు ప్యాకింగ్ వేరేరకంగా ఉందని రైతులు వాపోయారు. ఈ విషయంపై గద్వాల మండల వ్యవసాయ అధికారి మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే దుకాణానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. మిరప విత్తనాల విక్రయాలను నిలిపివేయాలని యజమానిని ఆదేశించారు. అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, సెంట్రల్ లైసెన్స్, ప్రిన్సిపాల్ లైసెన్స్, ఇన్‌వాయిస్‌లపై విచారణ చేపడుతామని మల్లారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక నిఘాను ఉంచిందని, ఎక్కడైనా విత్తనాల తేడాలు వస్తే ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.