మహబూబ్‌నగర్

ప్రైవేటు పాఠశాలలపై అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, జూన్ 9: పట్టణంలో ప్రైవేటు పాఠశాలలపై గురువారం అధికారులు, ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు నిబంధనలు వర్తింపచేసేందుకు జిఓ నెం.42ను జారీ చేయగా ఏరియా పాఠశాలలపై నిఘా ఉంచింది. ఉదయం పలు ప్రైవేటు పాఠశాలలో పాఠ్యా పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తుండగా నిఘా పెట్టి పట్టుకోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
జిల్లా విద్యాధికారి తక్షణమే స్పందించి మల్దకల్ ఎంఇఓను ఇన్‌చార్జితో పాటుగా ఎంపిపి సుందర్‌రాజు, అయిజ చైర్మన్ రాజేశ్వరి, ఎంఇఓ మేరమ్మ, ఎస్‌ఐ రమేష్‌లు పలు పాఠశాలల్లో దాడులు చేశారు. అక్షర, కృష్ణవేణి, శ్రీచైతన్య, ఠాగూర్, బ్రైట్‌స్టార్, బిజిఆర్ పాఠశాలల్లో ప్రభుత్వంకు విరుద్ద్ధంగా పాఠ్యాంశ పుస్తకాలు, నోట్ బుక్కులు ఉండడంతో స్వాధీన పర్చుకొని రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మల్లికార్జున్‌చే పంచనామ నిర్వహించి సీజ్ చేశారు.
ప్రభుత్వానికి విరుద్ద్ధంగా నడుపుతున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎంపిపి సుందర్‌రాజు మాట్లాడుతూ వెనుకబడిన ఎస్సీ, ఎస్టి, బిసి విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.