మహబూబ్‌నగర్

ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, జూన్ 9: గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు చంద్రబాబు అడ్డుతగిలారని ప్రాజెక్టు కోసం మళ్లీ అడ్డుతగులుతున్నారని చంద్రబాబు నాయుడుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు. గురువారం కోస్గి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో పాలించిన ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రం దగాపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే పొరుగున్న ఉన్న చంద్రబాబునాయుడు అడ్డుతగలడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అడ్డుతగలడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా రోడ్ల అభివృద్దికి గాను రూ.1800కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో బిటిరోడ్లు లేని గ్రామాలు ఉండవన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.