మహబూబ్‌నగర్

ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 9: ఆరీసీలో కార్మిక సంఘాల ఎన్నికల నగారా మొగింది. దింతో కార్మికుల్లో సందడి నెలకొంది. ఎన్నికల నగరా మొగడంతో ఆర్టీసీ కార్మికులను ఎవరిని తట్టిన ఎన్నికలపైనే జోరుగా చర్చజరుగుతుంది. ఎప్పుడేప్పుడా అంటూ కార్మికులు ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు కార్మిక శాఖ ఈ నెల 6న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల జూలై 19న ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ అధికారికంగా ప్రకటన వెలువరించడంతో జిల్లాలోని ఆర్టీసీ కార్మికుల్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. జిల్లాలోని ప్రధాన సంఘాల నాయకులు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించారు. ఆర్టీసీలో 2012 డిసెంబర్ 22న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ప్రతి రెండేళ్ల కోసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్ర విభజన కారణంగా మరో రెండేళ్లు అదనంగా సమయం గడిచిపోయింది. ఆర్టీసీ ఎన్నికల నగరా మొగడంతో జిల్లాలో 9 డిపోల పరిధిలో 4260 మంది కార్మికులు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వచ్చే నెల 19న జరిగే ఎన్నికల్లో వీళ్లే ఓటర్లుగా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అయితే 2012లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎంయూ నుండి వేరు కుంపటి పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల తరపున కీలక పాత్ర పోషించిన టిఎంయూ ఆ ఎన్నికల్లో జిల్లాలో ఘన విజయం సాధించింది. అప్పట్లో ఎంప్లాయాస్ యూనియన్‌తో కలిసి పోటీ చేసి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట డిపోల మినహా మిగితా డిపోలలో టిఎంయూ ఘన విజయం సాధించింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం దాంతో టిఎంయూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో బలియమైన శక్తిగా తయారైంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్‌ఎంయూ ఒకటిగా, గుర్తింపు సంఘం టిఎంయూను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కూటమిగా ఏర్పాటు కావాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై 19న జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు టిఎంయూ నేతలు పావులు కదుపుతుండగా మరోపక్క ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్‌ఎంయూలు మరోపక్క రాష్టస్థ్రాయిలో ఒప్పందాల మేరకు జిల్లాలో కూడా కలిసి పోటీ చేసి మద్దతు కూడగట్టుకుంటే మంచి ఫలితాలు రావచ్చు అనే అంచనాలతో ఈ సంఘం నేతలు వ్యూహాలను రచించుకుంటున్నారు. ఒక్కసారిగా ఆర్టీసి కార్మికుల దృష్టి అంతా ఎన్నికల వైపు మళ్లింది. ఇప్పటికే ఆయా సంఘాల నేతలు కార్మికులతో లాబీయింగ్‌లను షురూ చేశారు. కొందరు రాజకీయ నాయకుల సహకారం కూడా తీసుకోవాలని వివిధ సంఘాల నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో కొల్లాపూర్ డిపో ఆవిర్భవించకపోవడంతో ఈ దపా డిపో ఏర్పాటు కావడంతో ఇక్కడ పని చేస్తున్న కార్మికులకు ఈ సారి ఓటు వేసే అవకాశం వచ్చింది.
డిపోల వారీగా సభ్యత్వాల వివరాలు
మహబూబ్‌నగర్ - 569, షాద్‌నగర్ - 528,
నాగర్‌కర్నూల్ - 337, వనపర్తి - 576,
గద్వాల - 547, కల్వకుర్తి - 516,
అచ్చంపేట - 374, కొల్లాపూర్ - 271,
మొత్తం - 4260