మహబూబ్‌నగర్

శాంతి భద్రతల పరిరక్షణకు రూ. 350కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్/కొందుర్గు, జూన్ 9: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సిఎం కెసిఆర్ 350కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నర్సింహరెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించేందుకు సిఎం కెసిఆర్ పెద్దపీట వేయడం జఠిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 550పోలీస్ స్టేషన్లకు కొత్తవాహనాలను ఇవ్వడం జరిగిందని, అలాగే హైద్రాబాద్, వరంగల్ పట్టణాలకు సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి వాహనాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో దొంగతనాలను పూర్తిగా నివారించేందుకు గాను వెయ్యి సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి కొన్ని పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై పోలీసులు స్పందించాలని, ఫిర్యాదు దారుల పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ప్రజల మద్దతుతోనే రాష్ట్రంలో ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేరాలను నియంత్రించేందుకు పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు ప్రజలందరు సహకరించాలని కోరారు. గోదావరి పుష్కరాలను విజయవంతం చేయడంతో పోలీసుల పాత్ర కీలమైందని, అలాగే రానున్న కృష్ణాపుష్కరాలను విజయవంతం చేసేందుకు పోలీసులు కీలకపాత్ర వహించాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్ కాకతీయ ద్వారా 2500కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ఆరువేల చెరువులకు గాను 40వేల చెరువులకు పున:నిర్మాణం పనులు చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడంతో పాటు స్వచ్చమైన నీటిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ద్ధం చేస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యత లభించే విధంగా సిఎం కెసిఆర్ పనులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బోగస్ కళాశాలలు, పాఠశాలలను ఏరివేసేందుకే విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను నేర్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. షాద్‌నగర్ పట్టణంలో పోలీస్ క్వాటర్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే కేశంపేట మండలంలో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని శాసన సభ్యుడు ఎల్గనమోని అంజయ్య యాదవ్ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డిని కోరగా అందుకు హోంమంత్రి స్పందిస్తూ నిర్మించేందుకు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాశిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పిచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, హైద్రాబాద్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఐజి అకున్ సభర్వాల్, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మల్లారెడ్డి, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎంపిపి గాయిత్రి, జడ్పిటిసి సభ్యురాలు స్వరూప, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగేనావర్, రూరల్ సిఐ మధుసూదన్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్, పోచయ్య, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.