అదిలాబాద్

జిల్లాలో కొత్తగా 12 బిసి వసతి గృహాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 9: బిసి జనాభా అధికంగా ఉన్న జిల్లాలో వెనకబడినవర్గాల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపుదలకోసం కేంద్ర సామాజిక న్యాయశాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి తారా చంద్ గెహ్లాత్ కొత్తగా 12 బిసి వసతి గృహాలను జిల్లాకు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర బిసి సంక్షేమ శాఖ మంత్రితో ఎంపి గెడం నగేష్‌తో కలిసి బిసిల సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించారు. ఈ మేరకు గురువారం మంత్రి రామన్న ఒక ప్రకటన విడుదల చేస్తూ బిసి శాఖ మంత్రితో జరిపిన బేటి ఫలవంతమైందన్నారు. జిల్లాలో బిసి విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్రం సహకరించాలని తాను విన్నవించగా వెంటనే స్పందించిన తారా చంద్ గెహ్లాత్ 12 బిసి వసతి గృహాలు జిల్లాకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు భారీ ఎత్తున గురుకుల వసతిగృహాలు మంజూరు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందన్నారు. ఆంగ్లమాద్యంతో కూడిన విద్యబోధనతోపాటు వసతి గృహాల్లో విద్యాప్రమాణాల మెరుగుదల కోసం చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించడం జరిగిందని, రాష్ట్రంలో బిసి సంక్షేమం కోసం తనవంతు కృషిచేస్తానని గెహ్లాత్ హామీ ఇచ్చినట్లు రామన్న వివరించారు. కేంద్రమంత్రితో ఎంపి నగేష్‌తో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి మాణిక్‌రావు, ఉన్నతాధికారులు బిఎల్ మీనా, డాక్టర్ రమేష్‌కుమార్, మాజీ జడ్పీటీసీ అశోక్ పాల్గొన్నారు.