అదిలాబాద్

పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిన ఎఎస్పీ రాధిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 9: పట్టుదలే లక్ష్యంగా జిల్లా ఎఎస్పీ రాధిక 8850 మీటర్ల ఎత్తుగల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పోలీసు శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేశారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అభినందించారు. గురువారం ఎఎస్పీ రాధిక జిల్లా ఎస్పీ దుగ్గల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తీరును ఛాయచిత్రాలతో వివరించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ గతంలో కున్ పర్వతం విజయవంతంగా అధిరోహించడం వల్ల ఇదే స్పూర్తితో ఎవరెస్ట్‌ను అధిరోహించడం జరిగిందని, నెల రోజుల ముందు అన్ని విధాల శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ ఓ మహిళ.. అందులో పోలీసు శాఖ నుండి తొలి అధికారినిగా ఎవరెస్ట్ ఎక్కడం జిల్లా పోలీసు ప్రతిష్టను పెంచారని, గొప్ప రికార్డును అదిగమించడం వల్ల దేశంలోనే తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి రాణించే శక్తి ఉంటుందని, వారిలోని ప్రతిభను వెలికితీయాలని ఎస్పీ సూచించారు.