అదిలాబాద్

కోదండరాంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, జూన్ 9: తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించిన టిజెఎసి చైర్మన్ కోదండరాంను విమర్శించిన మంత్రులు, ఎంపిలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎబివిపి జిల్లా కోకన్వీనర్ కృష్ణదేవరాయలు అన్నారు. మండలంలోని ఐబిలో గురువారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సకల జనులను ముందుకు తీసుకుపోయిన ఆచార్య కోదండరాంపై మంత్రులు, ఎంపిలు విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకే మంత్రులు, ఎంపిలు కోదండరాంపై విమర్శలకు దిగడం శోచనీయమన్నారు. రైతు ఆత్మహత్యలు, ఓపెన్‌కాస్టుల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వాన్ని కోదండరాం సూటిగా ప్రశ్నించడం వలనే, కోదండరాం వెనుక రాజకీయ శక్తులు ఉన్నయని మంత్రులు, ఎంపిలు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. సిఎం కెసిఆర్ పాలన కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు లబ్ధిచేకూరే విధంగా ఉందని ఆయన విమర్శించారు. విద్యార్ధి సంఘాల పోరాట ఫలితంగా తాండూర్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటి సిఎం కడియం శ్రీహరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఈవిద్యాసంవత్సరమే కళాశాలను ప్రారంభించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆనంద్, ప్రశాంత్ పాల్గొన్నారు.