నిజామాబాద్

నగల కోసం మహిళ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూన్ 9:దొంగతనం కేసులో జైలుకెళ్లి బయటకు వచ్చిన ఓ పాత నేరస్థుడు బంగారు నగల అపహరణ కోసం మహిళను ఉరేసి హత్య చేసాడు. హత్యకు గురైన మహిళ సెల్‌ఫోన్‌ను అపహరించుకుపోయి ఇతరులకు విక్రయించడంతో ఈ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి హత్య కేసును ఛేదించారు. బోధన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు ఈ హత్యకేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని తట్టికోట్ ఏరియాకు చెందిన సవిత ఈ నెల 2వ తేదీన మల్లారం అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మృతురాలి సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడు హన్మాండ్లు పోలీసుల చేతికి చిక్కాడు. దాంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హన్మాండ్లు దొంగతనం కేసులో జైలుకెళ్లి పది రోజుల క్రితమే విడుదలయ్యాడు. పాత పరిచయంతో సవితను జూన్ 2వ తేదీన బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో కలిసి మాట్లాడి ఆమెను ఆటోలో వర్ని మండల కేంద్రానికి తీసుకెళ్లాడు. సవిత ఒంటిపై బంగారు కమ్మలు, నగలు ఉన్నాయని గమనించి హన్మాండ్లు ఆమెను మాటలలో పెట్టాడు. వర్నిలో గల కల్లు దుకాణంలో కల్లు సేవించి అక్కడి నుండి ఆమెను లైంగిక వాంఛ కోసం మల్లారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. తాగిన మైకంలో తన వద్ద ఉన్నటువంటి టవల్‌తో సవితను ఉరేసి హత్య చేశారు. అమె ఒంటిపై ఉన్న కమ్మలు, బంగారు పుస్తెలను తీసుకుని ఆమె సెల్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్లాడు. ఈ ఫోన్‌ను ఇతరులకు విక్రయించి పరారవ్వగా సెల్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో బోధన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, వర్ని ఎస్‌ఐ అంజయ్య పాల్గొన్నారు.