నిజామాబాద్

మైనార్టీల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 9: మైనార్టీల సంక్షేమానికి టిఆర్‌ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ప్రభుత్వం నుండి మంజూరు అయిన చెక్కులను మైనార్టీ మజీద్ నిర్వహకులకు ప్రభుత్వ విప్ అందించారు. అనంతరము అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండగ సందర్భంగా ప్రభుత్వం 12మజీద్‌లకు రెండు లక్షల రూపాయలు మంజూరు చేయగా వాటిని మజీద్ నిర్వహకులకు పంపిణీ చేశామని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం షాధిముబారక్‌కు ప్రభుత్వం 51వేల రూపాయలు అందిస్తోందన్నారు. రంజాన్ పండగ సందర్భంగా మసీద్‌లకు చిన్నపాటి మరమ్మతులతో పాటు వెల్లవేసేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. పట్టణంలోని చెక్కులు అందని మిగతా మసీదులతో పాటు మండలాల్లోని మసీదులకు త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. అలాగే టిఆర్‌ఎస్ ప్రభుత్వం హాయంలో రంజాన్ పండగను ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకునేందుకు పేద మైనార్టీలకు దుస్తుల పంపిణీలతో పాటు వారి కోసం ఇఫ్తార్ విందును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డితో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాలకు సాంఘీక సంక్షేమ మహిళ డిగ్రీకళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందుకు గాను సిఎం కెసిఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యావాదాలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.
దోమకొండ మండల కేంద్రంలో 9కోట్ల రూపాయలతో నిర్మించిన రెసిడెన్షిల్ స్కూల్‌ను త్వరలోనే ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. మహిళ డిగ్రీకళాశాలలో అడ్మిషన్‌లు ప్రారంభం అయినట్లు చెప్పారు. దోమకొండలో ప్రారంభించే రెసిడెన్షియల్ స్కూల్‌లోనే డిగ్రీకళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకు ఇందులోనే డిగ్రీకళాశాల నిర్వహణ జరుగుతోందని అన్నారు. డిగ్రీలో ఏడు కోర్సుల్లో బిఎస్సీ(ఎంపిసిఎస్), బిఎస్సీ(బిజడ్‌సి), బిఎస్సీ(జడ్‌ఎంసి), బిఎ(హెచ్‌ఇపిపి), బిఎస్సీ(ఎంపిసి0), బికామ్ (జనరల్), బికామ్(కంప్యూటర్) కోర్సులు ఉన్నాయని అన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ఉద్ధెశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు పెద్ద పీఠవేశారనడనికి జిల్లాలో మంజూరు చేసిన డిగ్రీ కళాశాలలో నిదర్శనం అని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఐడిసిఎంఎస్ చైర్మెన్ ముజీబొద్దిన్, జడ్పీటిసి మదుసూదన్‌రావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, కౌన్సిలర్‌లు నిట్టువేణుగోపాల్‌రావు, గోపిగౌడ్, పొన్నల లక్ష్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, కుంచల శేఖర్, భూంరెడ్డి, వేణు, అంజాద్, చంద్రశేఖర్‌రెడ్డి, సాయి, లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.