నిజామాబాద్

ఆగస్టు నాటికి 1995 గ్రామాలకు శుద్ధి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా వచ్చే ఆగస్టు నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 1995 ఆవాసాలకు శుద్ధి చేయబడిన రక్షిత జలాలను అందిస్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మెన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన జలాల్‌పూర్ వద్ద నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ ఇంటెక్ వెల్ పనుల పురోగతిని పరిశీలించారు. మిషన్ భగీరథ ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి, ఎస్సారెస్పీ ఎస్‌ఇ సత్యనారాయణ తదితరులతో కలిసి పోచంపాడ్‌లో లక్ష్మి కెనాల్ ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 28,400 నివాస ప్రాంతాలకు దశల వారీగా శుద్ధి జలాలు అందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని అన్నారు. సుమారు 40వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే 30శాతం వరకు పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇంటింటికీ నీటిని అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున 19 ఇన్‌టెక్ వెల్‌లను నిర్మిస్తున్నామని అన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి 1995 నివాస ప్రాంతాలకు, డిసెంబర్ నెలాఖరు నాటికి 6100 ఆవాసాలకు, 2018 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నిర్దేశించిన మొత్తం 28,400 నివాస ప్రాంతాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపడా పరిమాణంలో నీటిని సరఫరా చేయనున్నామని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 80శాతం వ్యాధులు నీటి కాలుష్యం కారణంగానే వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటి వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, వేసవి సీజన్‌లో నీటి కోసం నెత్తిన బిందెలు పెట్టుకుని కిలోమీటర్ల కొద్ది కాలినడకన నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తెస్తూ, తాగునీటి ఇక్కట్లను పూర్తిగా పారద్రోలేందుకు, మారుమూల పల్లెల్లో సైతం ఇంటింటికి శుద్ధి జలాలు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని 1645 ఆవాసాలు, 4 మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలందరికీ తాగునీటిని అందించేందుకు వీలుగా 2650కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. ఎస్సారెస్పీ వద్ద 1350కోట్లతో నిర్మించే ఇన్‌టెక్ వెల్ ద్వారా 860 గ్రామాలకు, మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద 1300కోట్లతో నిర్మిస్తన్న ఇన్‌టెక్ వెల్ ద్వారా 785 నివాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో వచ్చే డిసెంబర్ నెలాఖరు నాటికి 269 గ్రామాలకు వాటర్ గ్రిడ్ ద్వారా శుద్ధి జలాలు సరఫరా చేయబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఎస్సారెస్పీ నుండి నీటిని మళ్లించి బాల్కొండ, మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లోని 36వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్మి కెనాల్ ఎత్తిపోతల పథకానికి 2006లోనే శంకుస్థాపన చేసినప్పటికీ, గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో 20శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని ఈ సందర్భంగా అధికారులపై వేముల ప్రశాంత్‌రెడ్డి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట ఈ పథకం పనులను వేగవంతం చేయించి 80శాతం పనులు పూర్తి చేయించామన్నారు. మిగతా 20శాతం పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.