విజయనగరం

పెండింగ్ ఫైల్స్‌ను సత్వరం పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 9: ఆక్రమణ, అన్యక్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు, సామాజిక భూముల వివరాలను సత్వరమే గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. గురువారం జిల్లా జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలో రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, చెరువులు, సామాజిక స్థలాలు అన్యాయాక్రాంతం, ఆక్రమణలకు గురైనవాటి వివరాలు నివేదించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు పరిరక్షణకు తహశీల్దార్లు చర్యలు చేపట్టి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ ఫైళ్లను త్వరతగతిన పరిష్కరించి, మనుగడలోలేని ఫైళ్ల వివరాలు రికార్డుచేసి రద్దు చేయాలని సూచించారు. ఆర్డీ ఓ పరిధిలోని రెవెన్యూ కార్యాలయాలో ఫైళ్ల క్లియరెన్స్‌ను ఆర్డీ ఓ పర్యవేక్షించాలని చెప్పారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంలో అందిన దరఖాస్తులు పరిష్కరించాలని అన్నారు. ఈ- ఆఫీసు నిర్వహణపై రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంతో ఆర్డీ ఓలు శ్రీనివాసమూర్తి, గోవిందరావు, స్పెష్టల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత పాల్గొన్నారు.