విజయనగరం

రెండు నెలల్లో పూర్తి చేయాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 9: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ లక్ష్యాన్ని రెండునెలల్లో సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం ఎం నాయక్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ పారిశుద్ధ్యం, స్వచ్ఛాంధ్ర, ఇంటింట మరుగుదొడ్డి నిర్మాణం లక్ష్యాలను సమీక్షించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధలను భాగస్వామ్యం చేసి ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం జరిగేలా ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని అన్నారు. గ్రామాల వారీగా అవగాహన సదస్సు నిర్వహించాలని తెలిపారు. మరుగుదొడ్లు నిర్మాణానికి ముందుకు వచ్చిన వారికి ఆర్డర్లు తక్షణం ఇవ్వాలని తెలిపారు. మరుగుదొడ్లు పూర్తిచేసుకున్నవారికి బిల్లులు వెంటనే చెల్లించాలని పరిశీలించిన గృహాలను, నిర్మాణాలను ఆన్‌లైన్‌లో జియోట్యాగింగ్ చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు 29కోట్ల రూపాయలు చెల్లించాలని అన్నారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనా గ్రామాలుగా ప్రకటించేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని చెప్పారు. ఈసమావేశంలో జడ్పీటి సి ఇ ఓ రాజకుమారి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఇ రమణారావు పాల్గొన్నారు.