విజయనగరం

దీక్షలవల్ల ప్రజలకు ఏమి ఒరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 9: తెలుగుదేశం ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షల పేరుతో నిర్వహించిన సభలు వలన సామాన్య ప్రజలకు ఒరిగిందేమిటని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు. గురువారం పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విజయనగరంలో పరిశ్రమలు మూతపడి కార్మికులు వీధినపడి తిరుగుతుంటే, సామాన్యులు డబ్బులు ఖర్చుపెట్టి బడిలో చేర్పించడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు రుణాలు లేక అనేక సమస్యలతో ప్రజానీకం అల్లాడుతుంటే నవ నిర్మాణ దీక్షలు కారణంగా వారం రోజులు అధికారులు దీక్షా సభల నిర్వహణలో తల మునకలయ్యారని అన్నారు.
ఈ కారణంగా పరిపాలన అస్తవ్యస్తంగా మారి ప్రజా సమస్యలు పేరుకుపోయాయని చెప్పారు. ఈ రెండేళ్లలో ఏ మీ చేయలేని ప్రభుత్వం రానున్న మూడేళ్లల్లో ప్రగతి సాధిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. మూసిన పరిశ్రమలు తెరిపించేందుకు మంత్రి శ్రద్ధ తీసుకోవాలని హితవుపలికారు. ఈ సమావేశం పార్టీల నాయకులు రమేష్,రాజారావు, నాగభూషణం పాల్గొన్నారు.