విజయనగరం

ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,జూన్ 9: భద్రతాపరంగా లోపాలు ఉన్న పాఠశాలల బస్సులపై చర్యలు తీసుకోక తప్పదని సాలూరు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పి.వి. గంగాధరరావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో పట్టణంలో గల ప్రైవేటు పాఠశాలల బస్సుల యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండడంతోపాటు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయస్సు గల వారిని మాత్రమే నియమించుకోవాలని అన్నారు. డ్రైవర్‌తోపాటు సహాయకుడుని తప్పనిసరిగా ఏర్పాటు చేయడంతోపాటు బస్సులలో డ్రైవర్ అడ్రస్సు, ఫోన్ నెం., పాఠశాల యాజమాన్యంపేరు, ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల పేరును బస్సుకు నాలుగువైపులా కనబడేటట్లు రాయించాలని ఆదేశించారు. అత్యవసర ద్వారం తప్పనిసరిగా ఏర్పాటు చేయడంతోపాటు అద్దాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. బస్సు కండీషన్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించాలని చెప్పారు. బస్సులను మోటారు వె హికల్ సిబ్బందితో ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సై వరప్రసాద్, పాఠశాల యాజమాన్య ప్రతిధులు, డ్రైవర్లు పాల్గొన్నారు.