విజయనగరం

ఆరోగ్య ఉపకేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, జూన్ 9: ఆరోగ్య ఉప కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తూ వైద్యసేవలను అందుబాటులో ఉంచాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్. త్రినాథరావు ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని చినదుంగాడ, బాణాది గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో మాతా శిశు సంరక్షణకు సేవలకు అనుకూలమైన వసతులు ఉన్నాయా లేదా మహిళా ఆరోగ్య కార్యకర్తలు విధులను ఏవిధంగా నిర్వహిస్తున్నది పరిశీలించారు. బాలింతలు, గర్భిణీలలో ప్రమాదకర సమస్యలను గుర్తించి వైద్యాధికారిచే పరీక్షలు జరిపించాలని అన్నారు. ఈ సందర్భంగా చినదుంగాడ లో ఉన్న గర్భిణీ లను కలసి మహిళా ఆరోగ్య కార్యకర్తల పనితీరుపై ఆరా తీశారు. నలుగురు గర్భిణీలకు రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఉప కేంద్రాలలో బిపి, రక్త హీనతకు సంబంధించిన పరిసరాల పనితీరుపై సమీక్షించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట సిహెచ్ ఓ రమేష్‌బాబు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు వి.అప్పయ్యమ్మ, వెంకటలక్ష్మి, సంతోషి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.