నల్గొండ

తెలంగాణకు హరితహారం వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 9: తెలంగాణకు హరితహారం ఒక వరంలా భావించి జిల్లాను ముందంజలో ఉంచే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ అనితా రామచంద్రన్ సూచించారు. గురువారం డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొక్కలు నర్సరీలలో సిద్దంగా ఉన్నాయని, నీటి వసతి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని విస్తుృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా రక్షణ చర్యలు సైతం తీసుకోవాలన్నారు. గ్రామాలలలో సర్పంచ్, కార్యదర్శిలోలు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫ్యాక్టరీల యాజమాన్యంతో సమావేశాలు ఏర్పాటు చేసి పాఠశాలల్లో, ఫ్యాక్టరీలలో ఎక్కువగా మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీలో పాంపాండ్ నిర్మాణం, సన్న, చిన్నకారు రైతులు ఏర్పాటు చేసుకోవాలని, వీటి ద్వారా నీటి సమర్థ్యం పెరగడంతోపాటు అనేక ప్రయోజనాలుంటాయన్నారు. వీటిపై రైతులకు కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణానికి వందశాతం కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకుని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సైదులు, డ్వామా పీడి దామోదర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి అంజయ్య, డిపివో ప్రభాకర్‌రెడ్డి, ఎంపిడివోలు అధికారులు పాల్గొన్నారు.