నల్గొండ

షా సభకు భారీ భద్రత: ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 9: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగసభకు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో బహిరంగసభ స్థలాన్ని పరిశీలించి చేపట్టాల్సిన భద్రత చర్యలను సమీక్షించారు. బహిరంగసభ వేదిక, బహిరంగసభ స్థలం, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుని పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటుచేస్తున్నామన్నారు. తన పర్యవేక్షణలో అధనపు ఎస్పితో పాటు వందలాది మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బహిరంగసభకు వచ్చే వారు పోలీస్ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఆయన వెంట స్థానిక డిఎస్పీ అబ్దుల్ రషీద్, పట్టణ సిఐ మొగిలయ్య, ఎస్‌ఐలు సంతోష్, బాసీత్, క్రాంతికుమార్, జబ్బార్ ఉన్నారు.
స్టేషన్‌లను తనిఖీ చేసిన ఎస్పీ
జిల్లా ఎస్పిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్.ప్రకాశ్‌రెడ్డి గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌తో పాటు రూరల్ పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నేరాలు, పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించారు.
కోదాడ పిఎస్‌ల సందర్శన
కోదాడ: ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి గురువారం కోదాడ పట్టణ, గ్రామీణ పోలీస్‌స్టేషన్లను అకస్మికంగా సందర్శించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించిన యస్‌పి ప్రకాష్‌రెడ్డి సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కోదాడ పట్టణ ఇన్సిపెక్టర్ రజితారెడ్డి, యస్‌ఐ దోసపాటి సురేష్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి పట్టణంలోనే వున్న కోదాడ గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను యస్‌పి ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో గ్రామీణ సిఐ మధుసూదన్‌రెడ్డి, యస్‌ఐ విజయ్‌ప్రకాష్ పాల్గొన్నారు. ఎస్పీ వెంట పేట డిఎస్పీ అబ్దుల్ రషీద్ వున్నారు.