నల్గొండ

అమిత్‌షా సభకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 9: గత రెండేళ్ల ఎన్డీయే పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన వికాస్‌పర్వ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలో నిర్వహించే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, రాబోయే మూడెళ్లలో చేయనున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతంచేసే లక్ష్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య ప్రధానకేంద్రంగా ఉన్న సూర్యాపేటలో అమిత్‌షా సభను నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ అధ్యక్షుడు బహిరంగసభలో పాల్గొననున్నందున సభ విజయవంతం కోసం గత 15రోజులుగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమం చేపట్టారు. పార్టీ ప్రజాప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల ఇండోర్ స్టేడియంలో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు 60వేల మంది వరకు జనసమీకరణ చేయనున్నారు. ఇండోర్ స్టేడియంలో భారీ వేధికను నిర్మించారు. ఈ వేధికపై 100మంది నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. సభావేధిక ముందు పార్టీ రాష్ట్ర నేతలు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటుచేశారు. 30వేల కుర్చిలను ఏర్పాటుచేస్తున్నారు. సాయంత్రం 4గంటలకు సభ నిర్వహించనున్నందున సభా ప్రాగణంతో పాటు ఇందిరమ్మకాలనీకి వెళ్లే అన్ని రోడ్లపై విద్యుత్ దీపాలను ఏర్పాటుచేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ఉండేందుకై జనరేటర్‌లను అందుబాటులో ఉంచారు. బహిరంగసభకు వచ్చే వాహనాల పార్కింగ్‌ను కిలోమీటర్ దూరంలో ఏర్పాటుచేయగా విఐపిల వాహనాల పార్కింగ్ సభావేధిక సమీపంలోనే ఏర్పాటుచేశారు. బహిరంగసభ నేపథ్యంలో పట్టణాన్ని కాశయజెండాలతో ముస్తాబుచేశారు. పట్టణంలోని ప్రధానవీధులతో పాటు జాతీయ రహదారిపై, బహిరంగసభ నిర్వహించే మార్గంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, బిజెపి తోరణాలను ఏర్పాటుచేశారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద భారీ స్వాగత ద్వారాన్ని నిర్మించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు పర్యటిస్తుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.
జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు డిఎస్పిలు, 15మంది సిఐలు, 60మంది ఎస్‌ఐలు, 500మంది పోలీస్ సిబ్బందిని భద్రతగా ఏర్పాటుచేశారు. ఎస్పి ప్రకాశ్‌రెడ్డి గురువారం బహిరంగసభ స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు.