నల్గొండ

జర్నలిస్టులకు త్వరలో అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 9: త్వరలో తెలంగాణలో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. గురువారం విలేఖరులతోమాట్లాడుతూ ఇప్పటికే కొంత మందికి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగిందని, లేని వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ 20కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వాటికి 80లక్షల వడ్డీ వచ్చిందని, పూర్తి మొత్తాన్ని జర్నలిస్టుల సంక్షేమానికే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 2014జూన్ 2నుండి ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు 50వేలు, మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల 3వేల చొప్పున చెల్లిస్తామని, చదువుకునే విద్యార్థులుంటే ప్రతి నెల వెయ్యి రూపాయలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇండ్లు లేని వారికి హైదరాబాద్‌లో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తదుపరి జిల్లా , మండల కేంద్రాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించే అవకాశముంటుందన్నారు.