శ్రీకాకుళం

చరిత్ర ఉన్న నేత వైకాపాలో ఉన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూన్ 9: వైకాపాలో మంచి చరిత్ర ఉన్న నాయకుడు ఒక్కరూ లేరని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం చంద్రబాబునాయుడుపై 4/20 కేసులు ఫిర్యాదులు చేసిన వైఎస్ జగన్ అతని అనుచరులు అవినీతి పరులని విమర్శించారు. వైఎస్ జగన్‌కు వత్తాసు పలుకుతున్న నాయకులు పూటకో పార్టీ ఫిరాయించి సిబిఐ కేసుల్లో నిందితులుగా ఉన్నారని విప్ పేర్కొన్నారు. జగన్‌పై 11, ఆయన తండ్రిపై నాలుగు కేసులు సిబిఐలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో గాలి జనార్దనరెడ్డితో చేతులు కలిపి కోట్లు విలువైన భూగర్భగనులు, ప్రజల ఆస్తులను, రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని వైసిపి నేతలపై విప్ విరుచుకుపడ్డారు. ఈ దోపిడీదారులకు సిఎం చంద్రబాబుని విమర్శించి నైతిక హక్కు లేదని రవికుమార్ అన్నారు. కేవలం తన తండ్రి సిఎం పదవిని తనకు ఇవ్వలేదని కోపంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా పార్టీ పెట్టి ప్రజల్లో విలువలు కోల్పోయిన జగన్, అతని అనుచరులు దేశం పార్టీని, అధినేతను విమర్శిస్తే సహించేది రవికుమార్ హెచ్చరించారు. గొప్ప ఆశయంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి, పెద్దలకు ఒక మహోన్నత చరిత్ర ఉందని రవికుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత రూ.25వేల కోట్లు రైతు రుణమాఫీ, రూ. 12వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ, వికలాంగులు, వృద్ధులకు భారీ ఎత్తున పింఛన్‌లు, ప్రతీవ్యక్తికి అయిదు కిలోల బియ్యం, విద్యార్థులకు ఫీజుల రీ యింబర్స్‌మెంట్, చెరువుల అభివృద్ధి పనులు, రహదారులు, ఉచితంగా ఇసుక పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్న టిడిపి ని 4/20 అని విమర్శించడం వైసిపి నేతల అజ్ఞానమని విప్ రవికుమార్ పేర్కొన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో దేశం నాయకుడు తమ్మినేని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.