శ్రీకాకుళం

వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూన్ 9: కొత్తూరు పట్టణంలో పలువురి నుంచి అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఉన్నపళంగా ఉడాయించిన వడ్డీ వ్యాపారి యాళ్ల వెంకటరావుకు కొత్తూరులో గురువారం బాధితులు దేహశుద్ధి చేశారు. అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి కొత్తూరుకు చెందిన బోణంగి నాగమ్మ, ఎం.దుర్గమ్మ, అల్లు మండోదరమ్మలతో పాటు మరో ఆరుగురి నుంచి 21 లక్షల 31 వేల రూ.లు వసూలు చేసి వెంకటరావు ఉడాయించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల కిందట ఇదే వడ్డీ వ్యాపారిపై ఎస్‌పికి కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు కొత్తూరు, పరిసర గ్రామాలకు చెందిన వారి నుంచి రాతపూర్వకమైన వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. అయితే, హిరమండలం మండలం కొండరాగోలు గ్రామానికి చెందిన వెంకటరావు కొత్తూరు పట్టణంలోనే కాకుండా బలద, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన వారి నుంచి కూడా కోట్లాది రూపాయలను వసూలు చేసినట్టు బాధితులు తెలిపారు. కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న వెంకటరావు ఇటీవల తన స్వగ్రామం కొండ రాగోలుకు చేరుకున్నాడని తెలుసుకున్న కొత్తూరు బాధితులు ఆయన స్వగ్రామానికి వెళ్లి కొత్తూరు తీసుకొచ్చి పాడుబడిన గదిలో గురువారం బంధించారు. అలాగే మోసం చేశాడని ఆందోళనతో దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుల వద్దకు వెళ్లి వెంకటరావును అప్పగించాలని కోరడంతో వెంకటరావును కొత్తూరు పురవీధుల మీదుగా ఊరేగింపుగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వెంకటరావు వద్ద మోసపోయినవారు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమాచారం ఇవ్వాలని కోరారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటరావును కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు.