కృష్ణ

కొత్త రేషన్ షాపులకు పచ్చజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 9: జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరగనుంది. నిత్యావసర సరుకుల పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు జిల్లాలో 206 దుకాణాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. బందరు డివిజన్‌లో 27 దుకాణాలు, గుడివాడ డివిజన్‌లో 32, నూజివీడు డివిజన్‌లో 39, విజయవాడ డివిజన్‌లో 108 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2161 చౌక ధర దుకాణాల ద్వారా 13లక్షల 70వేల మంది కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది. ఇకపై రేషన్ షాపుల సంఖ్య 2367 కానుంది. ప్రతి 500 కార్డులకు ఒక రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి సరుకుల పంపిణీని వేగవంతం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి అనుగుణంగా ఇటీవల రేషన్ షాపుల సంఖ్య పెంపుకు సర్వే చేసిన జిల్లా పౌర సరఫరాల అధికారులు 206 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం కొత్తగా ఏర్పాటయ్యే దుకాణాలకు డీలర్ల పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుండి అర్హులైన వారికి నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 18వతేదీ లోపు ఆయా మండల తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. తహశీల్దార్ల ప్రాధమిక పరిశీలన అనంతరం 23వతేదీన ఆయా డివిజన్‌ల వారీగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్రాత పరీక్షలో 32 మార్కులు సాధించి అర్హత పొందిన వారి వివరాలను అదే రోజు ఆర్డీవో కార్యాలయాల్లో ప్రకటిస్తారు. వీరికి 24వతేదీన 20 మార్కులకు వౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తుదారు జూన్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు గలవారై ఉండాలి. ఏ దుకాణానికైతే దరఖాస్తు చేసుకున్నాడో సంబంధిత ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఓటరు, ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత తహశీల్దార్ నుండి నివాస ధ్రువపత్రాన్ని దరఖాస్తుకు జత చేయాలి. దరఖాస్తుదారులపై ఎటువంటి సివిల్, క్రిమినల్ కేసులు ఉండకూడదు. గ్రామ సర్పంచ్, ఎంపిపి, జెడ్పీటిసి, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటిసి, ఎంపిటిసి, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు, సభ్యులు మొదలైన ప్రజాప్రతినిధులు, బ్రాంచ్ పోస్ట్ మాష్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, రెవెన్యూ అధికారుల బంధువులు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. అలాగే కిరాణా వ్యాపారం కూడా చేయకూడదు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వివిధ రకాలైన ఉపాధి పొందే వారు కూడా అనర్హులే. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందని నిబంధనల్లో వివరించారు.