కృష్ణ

తారకరామను విస్మరించి చింతలపూడి అంటారేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 9: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైలవరం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో విటిపిఎస్ నుండి వృథాగా పోయే నీటిని లిఫ్ట్ ద్వారా అందించేందుకు తారకరామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే దాన్ని విస్మరించి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తానని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నాయకులు ఎండి జానీ, రావూరి రామారావు, మాధవరెడ్డి, సాల్మన్‌రాజు, తదితరులు మాట్లాడారు. తారకరామ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతానికి వరం వంటిదని, గడచిన పాతికేళ్ళుగా ఇప్పటివరకూ ఇక్కడ కొనసాగిన మంత్రులు, ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేయించి సగం వరకూ పూర్తిచేయించి సాగునీటిని అందించారన్నారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ తన శాఖకు సంబంధించిన ఈ పథకానికి నిధులు మంజూరు చేయించి మిగిలిన పనులు కూడా పూర్తిచేయించాలన్నారు. దీనిద్వారా సాగునీటిని అందించి ఎన్టీఆర్ కలను నిజం జేయాల్సిందిపోయి దాన్ని మధ్యలోనే వదిలివేసి చింతలపూడి లిఫ్ట్ ద్వారా ఎన్‌ఎస్‌పి 117వ కిలోమీటరు వరకూ గోదావరి నీటిని రప్పిస్తానని చెప్పటం సత్యదూరమన్నారు. చేయాల్సినదాన్ని పట్టించుకోకుండా కొత్తదాన్ని చేస్తానని చెప్పటం ప్రజలను మభ్యపెట్టటంకాక మరేమిటని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను గాలికొదిలి అభివృద్ధి చేస్తున్నామని నవ నిర్మాణ దీక్షలు, సంకల్ప దీక్షలతో కాలం గడుపుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.