కృష్ణ

అటవీ భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 9: అటవీ భూముల డిఫారెస్టేషన్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువీడకుండా చేస్తున్న ప్రయత్నం ఈ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న కుట్రేనని సిపిఐ జిల్లా ఇన్‌చార్జ్ కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బాబు ప్రయత్నాలను ఇప్పటికి రెండుమార్లు కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టినా ఆయన కొనసాగించటం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చర్యలు ఫలిస్తే అటవీ సంపద ధ్వంసమై పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులపై ఆధారపడి జీవించేవారు, అటవీ భూములలో సాగు చేసుకుని జీవించేవారు ఆధారం లేక రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ నెల 7న సెంట్రల్ డిసిఎఫ్ జిల్లా అటవీ అధికారులతో కలిసి కొండపల్లి ఫారెస్ట్ బ్లాక్‌ను పరిశీలించి వెళ్ళటాన్ని బట్టి బాబు చర్యలు అర్థమవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అత్యంత ప్రమాదకరమైన ఈ చర్యలను వెంటనే విడనాడి పేదలకు పట్టాలివ్వాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేష్, మండల నాయకులు జిలానీ పాల్గొన్నారు.