విజయవాడ

పుష్కర ఘాట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: పదకొండు మెట్లతో కూడిన టెంప్లేట్ డిజైన్ నమూనాలతో ఒకే దఫా 15 మీటర్ల మెట్లను నిర్మించే విధానాన్ని మరింత వేగవంతం చేసి పుష్కర ఘాట్ల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలో నిర్మితమవుతున్న పద్మావతి, కృష్ణవేణి, సీతమ్మపాదాలు, దుర్గా, మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో గల జరుగుతున్న ఘాట్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 12న ప్రారంభమయ్యే పుష్కరాలకు రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంన్నందున ప్రతి గంటకు చేయాల్సిన పనులపై ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ల్యాండ్ లెవెలింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఘాట్ల నిర్మాణం సమాంతర ప్రక్రియలో చేపట్టాలన్నారు. బ్యారేజీ దిగువ స్థాయిలో నిర్మితమవుతున్న పనుల్లో ప్రగతి బృందాల ఏర్పాటు ద్వారా నిరంతర పర్యవేక్షణ వలన వేగవంతమైన పనితీరు సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదే పనితీరును బ్యారేజీ ఎగువస్థాయి మోడల్ గెస్ట్‌హౌస్ దుర్గాఘాట్ నుండి బరంపార్క్ వరకు వివిధ ఘాట్లలో బృందాలను ఏర్పాటుచేసి సమాంతర పనితీరు చూపాలన్నారు. ఇకపై ప్రతి గంటకుచేసే పనుల వివరాల ఫొటోలను పంపాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి సమక్షంలో పుష్కర పనుల ప్రగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ సందర్భంలో పనుల ప్రగతిని వివరిస్తామని కలెక్టర్ తెలిపారు. నవనిర్మాణ దీక్ష స్ఫూర్తితో ప్రజలు రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామ్యమవుతున్నారని అదే సందర్భంలో పుష్కరాల పనితీరును ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవటం జరుగుతుందన్నారు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజూ స్నానాలు నిర్వహిస్తారని దుర్గాఘాట్ తదితర ప్రాంతాల్లో చేపట్టే ఏకభారీ ఘాట్లలో ఒకేదఫా ఎంతమంది పుష్కర స్నానాలు చేయగలరో అనే విషయాన్ని సమీక్షించారు. పుష్కర ఘాట్లలోకి ప్రజలు స్వేచ్ఛగా స్నానాలు ఆచరించేందుకు విశాలమైన ప్రాంగణాలతో పాటు గ్రీనరీ, వేచియుండు ఖాళీ ప్రదేశాలతో కూడి సురక్షితమైన ప్రాంగణాలను ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. కుమ్మరిపాలెం సెంటర్ నుండి మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతం వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రహదారి పనులతో పాటు ఏఏ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్‌లు పూర్తిచేయాలో ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. అదే సందర్భంలో ఫైలింగ్ కోసం చేపట్టే దుర్గా ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేయాలన్నారు. మరో నాలుగురోజుల్లో పున్నమి ఘాట్ ప్రాంతాన్ని సందర్శిస్తానని ఘాట్లలో టైల్స్ నిర్మాణాలకు చెందిన నమూనా నిర్మాణాలను పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల పరిశీలనలో కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.