విజయవాడ

సిటీ స్క్వేర్ పనుల ప్రతిపాదనలు తయారుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: నగరంలో సిటీ స్క్వేర్, కెనాల్ ఫ్రంట్ డిజైన్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేయాలని చైనా ప్రతినిధుల బృందాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఎ కోరారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్‌తో కలిసి చైనా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వీటిలో ప్రధానంగా సిటీ స్క్వేర్, హౌసింగ్, దుర్గా ఘాట్, పవిత్ర సంగమం ఘాట్, కెనాల్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. వీటిలో ఇప్పటికే దుర్గాఘాట్, పవిత్ర సంగమం ఘాట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నగరంలో సిటీ స్క్వేర్, కెనాల్ ఫ్రంట్ డిజైన్లకు సంబంధించిన పనుల ప్రతిపాదనలను పది రోజుల్లో అందజేయాలని చైనా ప్రతినిధులను కలెక్టర్ కోరారు.