కర్నూల్

సంగమేశ్వరునికి నూతన శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, జూన్ 9:కొత్తపల్లి మండలంలో వెలసిన రూపాల సంగమేశ్వరుని ఆలయానికి మరమ్మతులు, శిథిలమైన ఉప ఆలయాల పునఃనిర్మాణానికి టెండర్లు పూర్తి చేయడంతో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి గురువారం భూమిపూజ చేశారు. డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక చొరవతో ఈ పనులకు రూ. 90 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ పనులను భువనేశ్వర్‌కు చెందిన జాతీయ పురస్కార శిల్పి అనిల్‌కుమార్ మహారాణి, 40 మంది శిల్ప నిపుణులతో చేపడుతారని ఆమె తెలిపారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఉత్తర రాజగోపురం, గర్భాలయ శిఖరంపై రాతి గోపుర కలశంపై అంతర ప్రకారం లక్ష్మిదేవి, గాయత్రి, వజ్ర లింగేశ్వర, సంగమేశ్వర, సూర్యనారాయణ, పంచముఖి, చిటికెల ఆంజనేయస్వామి ఆలయాలను పునాదుల నుంచి పునఃనిర్మిస్తామని ఆయా దేవుళ్ల విగ్రహాలు సిద్ధంగా వున్నట్లు ఆమె పేర్కొన్నారు. 50 రోజుల్లో 40 మంది శిల్పులు బృందాలుగా ఏర్పడి నిర్మాణ పనులను కృష్ణా పుష్కరాలకు 10 రోజుల ముందుగా పూర్తి చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఆమెతో పాటు ఇఇ శ్రీనివాసులు, తపతి పాండు, ఇఓ కమలాకరుడు పాల్గొన్నారు.