కర్నూల్

రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలు ఆగస్టు నాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 9: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29 నాటికి పూర్తి చేస్తామని శాప్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియంను శాప్ ఓఎస్‌డి నాగరాజు, డిఎస్‌డిఓ సత్యనారాయణలతో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇండోర్ స్టేడియంలో రాత్రిపూట క్రీడలు ఆడేందుకు, నిర్వహించేందుకు వౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నంద్యాల క్రీడా ప్రాంగణాన్ని ఆగస్టు 29 నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. స్టేడియం చుట్టు ప్రహరీ గోడపై ముళ్లకంచె ఏర్పాటు చేయాలని సూచించారు. స్టేడియంలో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నంద్యాలలో క్రీడలకు మంచి ఆదరణ ఉందని, నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డి క్రీడలను బాగా ప్రోత్సహిస్తున్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి క్రీడలను ఆదరించాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వౌళిక వసతుల కల్పనతోపాటు ఆధునిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. 2018-19 జాతీయ క్రీడలను రాష్ట్రం నిర్వహించే అవకాశం ఉందని, ఆనాటికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న క్రీడా ప్రాంగణాలన్ని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జాతీయ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించేందుకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకొనేందుకు జిల్లాల వారిగా పరిశీలిస్తున్నామని, కడప జిల్లాలో పూర్తిస్థాయిలో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి నిధులు ఇవ్వడంతోపాటు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. నంద్యాల ఇండోర్ స్టేడియంకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఫెన్సింగ్ క్రీడను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు శ్యాంసుందర్‌లాల్, రాష్ట్ర కార్యదర్శి మహేశ్వర్‌రావు, ఖోఖో కోచ్ భూపతిరావు పాల్గొన్నారు.