ఖమ్మం

ఎర్రుపాలెం ట్రాన్స్‌కో ఎఇపై విజిలెన్స్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, జూన్ 9: ఎర్రుపాలెం ట్రాన్స్‌కో ఎఇ రవీంధర్‌బాబుపై రైతులు ట్రాన్స్‌కో సిఎండికి ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం ట్రాన్స్‌కో విజిలెన్స్ సిఐ కె జనార్థన్‌రెడ్డి ఎర్రుపాలెంలో విచారణ నిర్వహించారు. మండల పరిధిలోని భీమవరం రెవెన్యూ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాళ్ళ వెంకటేశ్వర్లు తదితర 15మంది రైతులు కలసి ఒక లక్షరూపాయలు, రామన్నపాలెం గ్రామానికి చెందిన యరమల ఆదిరెడ్డి తదితర 12మంది రైతులు తమ గ్రామాల్లో ఉన్న 23కెవి ట్రాన్స్‌ఫారాలను మార్చి 63కెవి ట్రాన్స్‌ఫారాలు ఇచ్చేందుకు ఎఇ రవీంధర్‌బాబుకి 70వేలు ఇచ్చినట్లు గత నెలలో సిఎండికి ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం ట్రాన్స్‌కో సిఎండి ఆదేశాల మేరకు ట్రాన్స్‌కో విజిలెన్స్ సిఐ జనార్థన్‌రెడ్డి, ఎస్‌ఐ చక్రధర్‌లు విచారణ చేపట్టారు. ప్రతి రైతును విడివిడిగా పిలిచి విచారణ చేశారు. రైతులందరూ కూడా తామకు ట్రాన్స్‌ఫాం త్వరగా అందించేందుకు రవీంధర్‌బాబుకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. సిఐ ఎస్‌ఐలు రైతులతో సమగ్ర విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ తాము చేసిన విచారణను సిఎండి అధికారులకు నివేధిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎఇ రవీంధర్‌బాబును వివరణ కోరగా తనకు రైతులు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదన్నారు.