రాష్ట్రీయం

మిషన్ భగీరథకు మరో 2200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: మిషన్ భగీరథకు ఈ ఆర్థిక సంవత్సరం 2,200 కోట్ల రూపాయల రుణం అందించేందుకు నాబార్డ్ ముందుకు వచ్చింది. గత సంవత్సరం 1,976 కోట్లు మంజూరు చేశారు. దీంతో మిషన్ భగీరథకు ఇప్పటివరకు నాబార్డ్ 4,176 కోట్ల రూపాయల రుణ సహాయం అందించేందుకు అంగీకరించినట్టు అయింది. మొదటి విడత 1,976 కోట్ల రూపాయలు మంజూరు చేసి, నిధులను విడుదల కూడా చేశారు. రెండవ విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి నాబార్డ్ అండగా ఉంటుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ సత్యప్రసాద్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరాలకు అందించాల్సిన రుణ సహాయంపై పంచాయితీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌తో నాబార్డ్ ఉన్నతాధికారులు సచివాలయంలో గురువారం సమావేశం అయ్యారు. మెదక్ జిల్లాలోని గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో నాబార్డ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఆయా ప్రాంతాల పరిధిలో పనులకు 1,976.8 కోట్ల రుణ సహాయంలో రెండవ విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు.
మిషన్ భగీరథ పనులపై సమీక్ష
మిషన్ భగీరథ పనులను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం సమీక్షించారు. ఈ పనుల్లో నిర్లక్ష్యం చూపించవద్దని, సత్వరం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్, కామార్డె పట్టణాలతో పాటు 865 గ్రామాల దాహార్తిని తీర్చే ఇంటెక్ వెల్ పనులను సమీక్షించారు.

chitram సచివాలయంలో గురువారం పంచాయితీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌తో సమావేశమైన నాబార్డ్ ఉన్నతాధికారులు