హైదరాబాద్

అవిభక్త కవలలకు అమ్మ ప్రేమ పంచిన నిలోఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: తలలు కలిసి పుట్టిన అవిభక్త కవలలకు పదేళ్ల పాటు అమ్మప్రేమను పంచింది నిలోఫర్ ఆసుపత్రి. వరంగల్‌కు చెందిన ఓ పేద కుటుంబంలో జన్మించిన వీరిని అప్పట్లో అరుదైన ఆపరేషన్ చేసి విడదీసేందుకు అప్పటి సూపరింటెండెంట్ డా.ఎన్.సి.కె. రెడ్డి ఇక్కడకు తీసుకువచ్చారు. వీరి కోసం ఆసుపత్రి మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డే వీరికి ప్రపంచం. వీరి ఆలనాపాలనా చూసుకునేందుకు రోజుకు మూడు షిఫ్టుల్లో ముగ్గురు ఆయాలు. చదివించేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులు. ఇక వీరికిచ్చే భోజనం కూడా స్పెషలే కావటంతో వీరి పోషణ వ్యయంతో కూడుకుంది. అయినా వారికి అరుదైన ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వారిని ఆసుపత్రిలోనే పెట్టుకుని అన్ని రకాలుగా ఆసుపత్రే చూసుకుంది. వైద్యుల సలహా మేరకు వీరిరోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు విద్యాభ్యాసం చేస్తూనే, ఇపుడు నాలుగో తరగతి వరకు చదవగలిగారు. ఉదయానే్న లేచి ఫ్రెష్ అయి టిఫిన్ చేయటం, వార్డుకొచ్చే అధ్యాపకురాలి కోసం వేచి ఉండం, బుద్దిగా చదువుకోవటం ఆమె వెళ్లిపోయిన తర్వాత భోజనం చేసి హోం వర్కు చేసుకోవటం, ఆ తర్వాత సాయంత్రం కాసేపు ఆటవస్తువులతో ఆడుకుని హోం వర్కు చేసుకుని, భోజనం చేసి నిద్రపోవటం వీరి రోజువారీ కార్యక్రమాలు. మహిళా, శిశు సంబంధిత వ్యాధులకు వైద్యం అందించటంతో పాటు అపుడే పుట్టిన శిశువులపై అనేక రకాల అధ్యయనాలు చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ రిఫరెల్ ఆసుపత్రిగా పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రిలోనే పనె్నండేళ్లు నిండిన ఈ కవలలు ఇక్కడే ఉంటారా? అన్నది అయోమయమే. తలలు అంటుకుని పుట్టడం వీరికి శాపంగా మారింది. పనె్నండేళ్లకు పై బడిన చిన్నారులెవ్వరికి కూడా నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స చేసే అవకాశం లేకపోవటంతో, ఇప్పటి వరకు వారినిఅమ్మలా అక్కున చేర్చుకున్న నిలోఫర్ ఆసుపత్రి ఒడిని విడిచి ఆ చిన్నారులు వెళ్తారా? వీరి పోషణ భారాన్ని తల్లిదండ్రులెలా భరిస్తారు? కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని వారిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఆసుపత్రిలోనే ఉంచేలా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? చూడాలి!