హైదరాబాద్

విశ్వనగరంగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి 1900 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి తెలిపారు.
గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు డబుల్‌బెడ్ రూమ్‌లను నిర్మించి ఇండ్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని ఆయన తెలిపారు. రూ.11 కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని ఆయన అన్నారు. అదే విధంగా మున్సిపల్ పరిధిలో అంచెలంచెలుగా అన్ని రోడ్లను సిసి రోడ్లుగా చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
రానున్న వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం చేయడానికి చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు వ్యర్థపదార్థాలను తీసివేసి చెరువులను సుందరీకరణ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. పేదలు నివసించే ప్రాంతాలలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్‌ను నిర్మించుటకు అన్ని కాలనీలకు నిధులు కేటాయించడం జరిగిందని, జిహెచ్‌ఎంసి పరిధిలోని, మధ్యతరగతి వారు వారు నివసించే ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
తొలుత 16 కోట్లతో మల్కంచెరువు సుందరీకరణ పనులకు, ప్రశాంతి హిల్స్ వద్ద 21 లక్షలతో చేపట్టే సిసి రోడ్డుకు, పాపిరెడ్డి కాలనీలో 50 లక్షల వ్యయంతో చేపట్టే మోడల్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. సురభీనగర్ కాలనీలో 17.20 లక్షల వ్యయంతో నిర్మించే మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్‌కు, మజీద్‌గూడ వద్ద రూ.40 లక్షలతో నిర్మించే సిసి రోడ్డుకు, రూ.45.50 లక్షల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపాన గల ఇజ్జత్‌నగర్‌లో చేపట్టే సిసి రోడ్డుకు, హఫీజ్‌పేటలోని మారుతీనగర్ కాలనీలో 2 కోట్లతో నిర్మించనున్న మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్‌కు, కూకట్‌పల్లిలో ఎల్లమ్మ బండ రిజర్యాయర్ వద్ద 3 కోట్లతో నిర్మించనున్న డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్‌కు మంత్రి శంకుస్థాపన గావించారు.
ఈ కార్యక్రమాల్లో శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి డిప్యూటీ కమీషనర్ మమత, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.