రంగారెడ్డి

కోదండరామ్ వ్యాఖ్యలపై విమర్శలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 9: ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యలపై మంత్రులు విమర్శలు చేయడం తగదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అదికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా చర్చించి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవుపలికారు. గురువారం ఉప్పల్ కుమ్మరిబస్తీలో శ్రీగాయత్రి స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకోసం పోరాటం చేసిన కోదండరామ్‌ను సమస్యలపై ప్రజలు అడిగే హక్కు ఉందన్నారు. ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ ఇచ్చారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధిని నిర్లక్ష్యంచేస్తే ప్రజాస్వామ్యంలో ఆడిగేహక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం బిసి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చకుండా, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెఏసి ఎక్కడ అంటున్నారు మరి టిఆర్‌ఎస్ ఎక్కడ ఉందని విమర్శించారు. వాటర్ గ్రిడ్‌ల పేరుతో కమీషన్ కోసమే కోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి.. కాంట్రాక్టర్లకు తప్ప, ఇతరులెవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను మాట్లాడేవారిపై విమర్శలను మాని ప్రజలకు జవాబుదారీతనంగా నిలవాలని కృష్ణయ్య పేర్కొన్నారు.
టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
విద్య ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం ఉప్పల్ కుమ్మరిబస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గాయత్రి స్కూల్‌ను స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. వందశాతం అక్షరాస్యత ఉన్న అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతతో విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం ఖాళీగా ఉన్న 40వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. విద్య లేకపోవడం వల్ల అభివృద్ధిలో వెనుకబడిపోతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. శ్రీ గాయత్రి స్కూల్ చైర్మన్ టి.శ్రీనివాస్, డైరెక్టర్ పి.నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మద్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్, చిల్కానగర్ కార్పొరేటర్లు మేకల అనలారెడ్డి, జి.సరస్వతి, టిఆర్‌ఎస్ నేతలు ఆజామ్ అలీ, బేతి సుభాష్‌రెడ్డి, దర్గ దయాకర్‌రెడ్డి, అరటికాయల భాస్కర్, రఘుపతిరెడ్డి, బిజెపి నేతలు మంకాల లక్ష్మణ్, బలవంతచారి, శ్రీనివాసశర్మ, మధు, నిదానకవి శ్రీరాములు, స్కూల్ భవనం యజమాని పి.ఉపేందర్, శ్రీ గాయత్రి స్కూల్ డైరెక్టర్లు వినయ్, మదన్, కార్తీక్, రవికిరణ్‌రెడ్డి, పట్టణ పెద్దలు పాల్గొన్నారు.