హైదరాబాద్

దళిత జాతి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 9: దళిత జాతి ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరినిర్వాన్ భూమి సమ్మాన్ కార్యసమితి పేర్కొంది. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల అభినందన సభకు ముఖ్య అతిథిగా అంబేద్కర్ పరినిర్వాన్ భూమి సమితి, జాతీయ దళిత మహాసభ పంచాయతీ చైర్మన్ ఇంద్రేష గజ్‌బియే మాట్లాడుతూ దళిత జాతి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. రిజర్వేషన్లు లేని విభాగాల్లోనూ వాటిని అమలు చేయాలన్నారు. అంబేద్కర్ పంచతీర్థాలకు పనె్నండేళ్ల పోరాట కృషికి కేంద్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు మంజూరు చేయటం దళితుల విజయం అన్నారు. పంచతీర్థాలను ప్రతి దళితుడు దర్శించుకోవాలన్నారు. అదేవిధంగా సమితి అభ్యున్నతి కోసం కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కరణం కిషన్ మాట్లాడుతూ దళితులకు నాణ్యమైన విద్యనందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. దళితుల రక్షణ కోసం ఎంతటి ఉద్యమం చేపట్టేందుకైనా వెనకాడనని అన్నారు. పంచతీర్థాలను దళితులంతా ఓ పుణ్య క్షేత్రంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం రాజేశ్, దళిత నేతలు పాల్గొన్నారు.