రంగారెడ్డి

ఆస్తిపన్ను చెల్లించని దుకాణాల సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 9: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ఆస్తిపన్ను బకాయిలపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. సకాలంలో చెల్లించకుండా ఎగనామం పెడుతున్న మున్సిపల్ వ్యాపార దుకాణాలను గురువారం పోలీసు బందోబస్తు మధ్య హబ్సిగూడలో అధికారులు సీజ్ చేశారు. ఒకొక్క దుకాణం లక్షల్లో బకాయిలు ఉన్నారని, సకాలంలో చెల్లించాలని నోటీసులు జారీ చేసినా స్పందించలేదని అధికారులు పేర్కొన్నారు. గతంలో టెండర్ ద్వారా దక్కించుకున్న దుకాణాలను లబ్ధిదారులు ఇతరులకు అద్దెకు ఇచ్చి అధిక మొత్తంలో వసూలు చేసుకుంటూ మున్సిపల్ ఆస్తిపన్ను చెల్లించలేదని అధికారులు తెలిపారు. సిబ్బంది వెళ్లితే ఇప్పుడు, అప్పుడూ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప పన్ను చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు కృష్ణప్రసాద్, స్వామి సిబ్బంది పాల్గొని ఏడు దుకాణాలను సీజ్‌చేశారు. ఆస్తిపన్ను చెల్లిస్తామన్న వినకుండా దుకాణాలను సీజ్‌చేసి వ్యాపారంపై దెబ్బకొట్టారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.