రంగారెడ్డి

అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లోకి వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 9: ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును చూసి తెలంగాణలోని పది జిల్లాల నుంచి అన్ని పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన టిడిపి, కాంగ్రెస్, బిజెపికి చెందిన పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తల చేరిక కార్యక్రమాన్ని పట్టణంలోని నవభారత్ ఫంక్షన్ హల్‌లో నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మాట్లాడుతూ కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్‌పై అచంచల విశ్వాసంతో విజయాన్ని కట్టబెడుతున్నారని అన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ కింద 176 చెరువుల అభివృద్ధికి రూ. 375 కోట్లు కేటాయించామని తెలిపారు. రైతులకు అండగా ఉండాలని రూ. 50 కోట్లతో నాలుగు మార్కెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బి రోడ్ల కోసం రాష్ట్రం మొత్తం మీద రూ.10 వేల కోట్లు కేటాయిస్తే అందులో జిల్లాకే రెండు వందల కోట్లు కేటాయించారని వివరించారు. జిల్లా మొత్తం మీద 1150 రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తే ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి చొరవతో మేడ్చల్ నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో 400కుపైగా ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం ఉండదని, పారదర్శకంగా ఉంటుందని, న అర్హులను రెవెన్యూ అధికారులే ఎంపిక చేస్తారని, మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో పట్టాల కోసం లక్షా 50 వేల దరఖాస్తులు వస్తే 80వేల వరకు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చామని, క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న 60వేల ఇళ్లకు 53వేల ఇళ్లను క్రమబద్దీకరించామని, మిగతావి ఏడువేలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో నిలిపివేశామని చెప్పారు. ఐటి మంత్రి కెటిఆర్ చొరవతో దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, దీంతో చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో రూ. 37 కోట్లతో సామాజిక భద్రత పథకం ఆసరా కింద పింఛన్‌లు అందజేస్తున్నామని వివరించారు.
కెసిఆర్ దేశంలోనే నంబర్‌వన్ సిఎం
ముఖ్యమంత్రి కెసిఆర్.. సంక్షేమ పథకాల అమలులో అభివృద్ధి విషయంలో దేశంలోనే నంబర్‌వన్ సిఎం అని మల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి ప్రశసించారు. తెలంగాణ సాధన ఉద్యమం మాదిరిగానే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు పడుతున్న శ్రమ అభినందించదగ్గదని కొనియడారు. కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసానని రెండు సంవత్సరాలలో టిడిపి చేసిందేమి లేదని టిఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ చివరికల్లా మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయని, మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
అపూర్వస్వాగతం
ముందుగా ఎంపి మల్లారెడ్డికి, మైనంపల్లి హన్మంతురావుకు మేడ్చల్ నాయకులు బాజభజంత్రీలతో, పటాకులు కాల్చుతూ అపూర్వ స్వాగతం పలికారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అరిపించి అక్కడి నుండి ర్యాలీగా నాయకులు ఫంక్షన్ హల్‌కు చేరుకున్నారు.
పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు
టిఆర్‌ఎస్‌లో టిడిపి, కాంగ్రెస్, బిజెపికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు చేరారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు మర్రి నర్సింహ్మరెడ్డి తన అనుచరులతో, మేడ్చల్‌కు చెందిన శేఖర్‌గౌడ్, డబిల్‌పూర్‌కు చెందిన వీర్లపల్లి భాగ్యరెడ్డి తన అనుచరగణంతో, గౌడవెళ్లి సర్పంచ్ మాధవి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులతో గులాబీ దళంలో చేరారు. తూంకుంట సర్పంచ్ ఎద్దు నాగేశ్‌గౌడ్, శామీర్‌పేట్ మాజీ ఎంపిపి నాలీక యాదగరి.. భారీ ఎత్తున తమ అనుచరులతో టిఆర్‌ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. కీసర, ఘట్‌కేసర్‌కు చెందిన పలువురు భారీగా చేరారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, కోఅప్షన్ సభ్యుడు జ్యోతిగౌడ్, జడ్పీటిసిలు రమాదేవి, సంజీవరెడ్డి, ఎంపిపిలు చంద్రశేఖర్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపిటిసి జహంగీర్, నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్, హరివర్ధన్‌రెడ్డి, నందారెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, మోనార్క్, ఆజ్మత్‌ఖాన్, విష్ణుచారి, లాయక్‌అలీ, రమేశ్, మోహన్‌రెడ్డి, అనంతరావు, కాశీ, పాండు, శైలేందర్, రాంరెడ్డి, తోటవసంత, సర్పంచ్‌లు కందాడి నరేందర్‌రెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు.