రంగారెడ్డి

చైన్‌స్నాచర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 8: ఐటి కారిడార్‌లో మంగళవారం హల్‌చల్ చేసిన ఇద్దరు చైన్‌స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డిసిపి కార్తికేయ వెల్లడించారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఉపేంద్రనాథ్ కుమారుడు నాగబాబు(22) శంషీగూడ ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నాడు. కూకట్‌పల్లి విజయనగర్ కాలనీకి చెందిన షాహున్ హుస్సేన్ ఇద్దరు ఇంటర్ ఫెయిలై జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్‌లు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. మంగళవారం రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు యత్నించారు. ఒకరి గొలుసును లాక్కోగా రెండు చోట్ల విఫలమైంది. రేఖ అనే యువతి ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత క్యాప్‌జెమిని ఐటి సంస్థ వద్దకు వచ్చి కల్పనలత మెడలో చైన్‌ను లాక్కొని వెళ్లిపోయారు. అక్కడే ఉన్న నర్సింహారెడ్డి పట్టుకునేందుకు యత్నించినా లాభం లేకుండా పోయింది. కాగా, పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కంట్రోల్ రూమ్‌లో సిసి కెమెరాలను వీక్షిస్తున్న సిబ్బంది సూచనలతో టిప్రుల్ ఐటి జంక్షన్‌లో పోలీసులు మాటువేశారు. హిల్‌గ్రిడ్జ్ విల్లాస్ నుంచి వస్తున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కొని నిందితులు పారిపోతుంటే పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని ఎనిమిది సిసి కెమెరాల్లో నిందితుల చిత్రాలు నమోదయ్యాయి. నిందితుల నుంచి రూ.90వేలు విలువచేసే ముడున్నర తులాల బంగారం, యమహా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. క్రైంసిబ్బంది, గచ్చిబౌలి సిఐ రమేశ్‌ను డిసిపి అభినందించారు.
కమిషనర్ అభినందన
గొలుసుదొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను, పౌరులను సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ అభినందించి రివార్డులను అందించారు. రేఖ, నర్సింహారెడ్డి, హోంగార్డు అశ్వని రవికుమార్, కంట్రోల్ రూమ్ కానిస్టేబుల్ పాషా, పెట్రోలింగ్ పోలీసులు రామ్మోహన్‌రెడ్డి, మహిపాల్‌ను అభినందించారు.