గుంటూరు

త్వరితగతిన పుష్కర పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 9: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలో చేపట్టిన పుష్కర పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పుష్కర పనుల పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, దేవాదాయ, పురపాలక, టూరిజం శాఖల అధికారులో ఆయా శాఖల వారీగా పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర పనులు చేపట్టిన ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రతి పనికి శాఖలకు సంబంధించిన ఒక అధికారిని నియమించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చేపట్టిన మొత్తం పనులన్నీ జూలై మాసాంతానికి పూర్తిచేయాలన్నారు. సర్వీసు సెక్టార్ కింద పనిచేసేశాఖల అధికారులు ఇప్పట్నుండే రోజువారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ, మునిసిపల్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతిఘాట్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అలాగే పుష్కరఘాట్లకు వెళ్లే అప్రోచ్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ ఎస్‌ఇని ఆదేశించారు. గుంటూరు నగరంలోని అన్ని అతిథిగృహాలకు ఆధునికీకరించాలన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ జిల్లాలో ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, దేవాదాయ, పురపాలక టూరిజంశాఖలు చేపడుతున్న పుష్కర పనుల పురోగతిని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి, అదనపు సంయుక్త కలెక్టర్ ముంతా వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ పద్మజారాణి, పురపాలక శాఖ ఆర్‌జెడి సిహెచ్ అనూరాధ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, సూపరింటెండెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.