గుంటూరు

మంగళగిరి కొండపైకి రోప్‌వేకు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 9: కొండపైకి పర్యాటకులను ఆకర్షించే విధంగా రోప్‌వే ఏర్పాటుకు గురువారం కోల్‌కతాకు చెందిన కంపెనీ ప్రతినిధి ప్రాథమిక సర్వే జరిపారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు, ధర్మకర్తలు కోసూరు శివనాగరాజు, ఆలేటి నాగలక్ష్మి, ఎవి సాంబశివరావు, ఉపప్రధాన అర్చకుడు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, చేనేత బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాస్‌తో కలిసి కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. కిందినుంచి సుమారు 800 అడుగులకు పైగా ఉన్న కొండ శిఖర భాగానికి రోప్‌వే ఏర్పాటుకు సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, రోప్‌వే సర్వీసెస్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ తన్మయి కుమార్ దేవ్ వెల్లడించారు. ఇంజినీరింగ్ అధికారుల బృందం సర్వే అనంతరం కచ్చితంగా ఎంత ఖర్చు కాగలదో చెప్పగలదని ఆయన ఇఓకు వివరించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కలిసి నిధులు కోరాలని నిర్ణయించారు. నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ వస్తే సర్వే పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని నిర్ణయించారు.