తూర్పుగోదావరి

పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన నల్లా సోదరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 9: పోలీసు అదేశాలు ధిక్కరించి దీక్షలు చేపట్టిన దివంగత నేత నల్లా సూర్యచంద్రరావు కుమారులు నల్లా అజయ్, సంజయ్‌లు కొద్దిసేపు అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ముద్రగడకు మద్దతుగా అజయ్, సంజయ్‌లు వారి స్వగృహంలో గురువారం దీక్షలు నిర్వహించారు. దీక్షలు సందర్భంగా నల్లా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపధ్యంలో పోలీసులు అజయ్, సంజయ్‌లను అరెస్టు చేస్తారన్న పుకార్లు గుప్పుమన్న కొద్దిసేపటికే వారిద్దరూ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. పోలీసులు యధావిధిగా వారి ఇంటి ఆవరణలో ఉన్నప్పటికీ అజయ్, సంజయ్‌లు కనిపించకపోవడంతో వారిలో ఉత్కంఠ నెలకొంది. కొద్దిసేపటి తరువాత వారు స్నేహితులతో కలసి ఇంటికి చేరుకోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.