తూర్పుగోదావరి

కోనసీమలో హైటెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 9: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో దీక్ష చేపట్టిన నేపధ్యంలో కోనసీమ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ముద్రగడ అమరణ నిరాహార దీక్షకు మద్దతుగా దీక్షలు చేపట్టాలని టిబికెజెఎసి పిలుపునివ్వడంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. ఈ నేపధ్యంలో కోనసీమ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టిబికె జెఎసి చైర్మన్ కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక గడియారపు స్తంభం వద్ద దీక్షల సన్నాహాలను పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30, 144 సెక్షన్‌లు అమలులో ఉన్నందున ఏ విధమైన దీక్షలు, సభలు, సమావేశాలు నిర్వహించరాందంటూ పోలీసులు అదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా టిబికె జెఎసి చైర్మన్ కల్వకొలను తాతాజీ ఇంటికి సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ భారీ పోలీసు బలగాలతో చేరుకుని ఆయనను గృహ నిర్భంధంలో ఉంచారు. అలాగే దివాంగత నల్లా సూర్యచంద్రరావు కుమారులు నల్లా సంజయ్, అజయ్‌లు ఇంటి వద్ద దీక్షలు చేపట్టారు. దీంతో అక్కడ కూడా భారీగా పోలీసులను మోహరించారు. విజయనగరం, రాజమండ్రిల నుండి 1200 మంది పోలీసులను రప్పించారు. వారిని కాపు ఉద్యమ నాయకుల ఇళ్ల వద్ద, ప్రధాన కూడళ్లు, ప్రధాన కార్యాలయాల వద్ధ మోహరింపజేసారు. అలాగే ప్రధాన కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టణంలోకి ప్రవేశించే వాహనాలకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నల్లా విష్ణు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. మైక్‌లో కోనసీమ వ్యాప్తంగా నిషేదాజ్ఞలు అమలులలో ఉన్నాయని పోలీసులు మైక్‌ల ద్వారా ముమ్మర ప్రచారం చేసారు. అయితే కోనసీమలోని పలు మండలాల్లో దీక్షలు చేసేందుకు ఉపక్రమించిన కాపు సంఘాల నాయకులను పోలీసులు నిలువరింపజేశారు. అయితే ముద్రగడను అరెస్టు చేసారన్న వార్తతో డి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, ఐ పోలవరం, అంబాజీపేట, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో కాపు నాయకులు, యువత ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. ముద్రగడ అరెస్టును నిరశిస్తూ శుక్రవారం కోనసీమ బంద్‌కు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న నాయకులను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. అయితే వారిని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ఊహా గానాలు వినిపిస్తున్నాయి.