చిత్తూరు

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నదని పీలేరు మాజీ ఎమ్మెల్యే జవి శ్రీనాద్ రెడ్డి అన్నారు. గురువారం కోటపల్లి హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మన అంగన్‌వాడీ పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందించడం జరుగుతున్నదని, అదేవిధంగా గర్భిణీలకు, బాలింతలకు, యుక్తవయస్సు కలిగిన స్ర్తిలకు పౌష్టికాహారం అందించడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు అమ్మ ఒడి లాంటివని, తల్లిదండ్రులకు శ్రమలేకుండా అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు సంరక్షణ కేంద్రాలుగా తోడ్పాటునిస్తున్నాయని అన్నారు. పీలేరుప్రజలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా తమ నివాసం ప్రక్కనే పాఠశాలకు స్థలాన్ని కేటాయించి విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బంది ఏర్పాటుచేసిన ఫోటో స్టాల్, వెజిటబుల్ స్టాల్స్‌లను ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వారికి కూడా జీతాలు పెంచడం జరిగిందని మహిళల అభివృద్ధికొరకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరుచేసి మహిళలు స్వయంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నదని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఖర్చులేకుండా ఉచితంగా భోజనం, యూనిఫాం, పుస్తకాలు సైతం అందజేస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జాయింట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువు పూర్తిచేసుకున్న తరువాత ఒకటర తరగతి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిడి పి ఓ కృష్ణవేణి, ఎం ఇ ఓ దయానంద రెడ్డి, సూపర్‌వైజర్ విజయలక్ష్మి, డాక్టర్ పవన్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఉమాకాంత్‌రెడ్డి, సి ఆర్ పి నాగరాజు, ప్రధానోపాధ్యాయులు సైదుల్లా, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.