చిత్తూరు

రానున్న మూడేళ్లలో జిల్లాలో 90 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 9: చిత్తూరు జిల్లాలో రానున్న మూడేళ్లలో 90 పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగాను 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్‌జైన్ అన్నారు. ఎస్వీ యూనివర్శిటీలోని సెనెట్ హాల్లో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, ఉపాధి, సాంకేతికత, నైపుణ్యాల అమలులో జిల్లాలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులపై తొలి సమావేశం జరిగింది. ఈసందర్భంగా సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ మహాసంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడానికి సిఎం నారాచంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్థల ద్వారా యువత నూతన శిఖరాలను అధిరోహించవచ్చని ప్రధాని నరేంద్రమోదీ, సిఎం చంద్రబాబు నాయుడుల ఆశయానికి తగ్గట్టుగా అందరం కలిసి పనిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో నైపుణ్య అభివృద్ధి సంస్థలను విరివిగా ఏర్పాటు చేసి వీటి ద్వారా ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. జిల్లాలోని 40 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ప్రతి సంవత్సరం 20వేల మంది ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వారిచేత శిక్షణ ఇప్పించి గ్రామీణ యువత జీవనోపాధికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. అలాగే పాఠశాలల నుంచే వివిధ వృత్తి విద్యా కోర్సులపై కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు ఆసక్తి చూపేవిధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గ్రామీణ, జిల్లా స్థాయిల్లో ఉద్యోగ, జీవన ప్రగతి అవకాశాలను, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను గుర్తించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. అలాగే గ్రామీణ యువతకు సరైన కెరీర్‌ను ఎంపిక చేసుకునేందుకు తగని సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రధానం ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని ఇందుకు శ్రీసిటీలోని మొబైల్ కంపినీల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే నిదర్శనమని అన్నారు. సింగిల్ డెస్క్ పారిశ్రామిక విధానాన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. శ్రీసిటీలో ఇప్పటికే 26 దేశాలకు చెందిన 108 సంస్థలు తమ పరిశ్రమలను స్థాపించిన కారణంగా రూ.23వేల కోట్లు పెట్టుబడులురాగా, 32వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఎస్వీయూ విసి దామోదరం, ద్రవిడ విశ్వ విద్యాలయం విసి సత్యనారాయణ, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్వీనర్ , డి ఆర్ డి ఏ పి.డి.రవిప్రకాష్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వరరాజు, ప్రతాప్,ఏపి ఐ ఐ సి అధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల అధికారులు, మహిళ ప్రాంగణం అధికారి, నాబార్డ్, అమరరాజా,పెప్సికో సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.